జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ వెబ్‌సైట్ ప్రారంభించనున్న సిఎంజగన్
నేటినుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
అమరావతి (CLiC2NEWS): ఎపిలో ని నగర, పట్టణ ప్రాంతాలలోని మధ్య తరగతి వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకాన్ని సిఎం జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తొలి విడతో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకిశం జిల్లా కందుకురు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు వేఅవుట్లలో అమలు చేయనున్నారు. అన్ని అనుమతులు, వసతులలో డిమాండ్‌కు అనుగుణంగా 150,200,240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు.
ఈరోజు నుండి http//migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తురు. రూ. 18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న ఆర్హులైన కుటుంబాలకు స్థలాలు కేటాయిస్తారు. సంవత్సర కాలంలో వీటిని అభివృద్ది చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్‌లో 10% ప్లాట్లుతో పాటు ధరలో 20% తగ్గింపు కూడా ప్రకటించారు. దరఖాస్తు సమయంలో మొత్తం ప్లాటు ధర చెల్లించిన వారికి 5% రాయితీ ఇస్తారు.