ఇక్రిశాట్ స‌ర్ణోత్స‌వాల లోగోను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఇక్రిశాట్ ప‌రిశోధ‌న‌లు ప్ర‌పంచానికి కొత్తదారి చూపాల‌ని ప్ర‌ధాని మోడి ఆకాంక్షించారు. ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వాల‌కు హాజ‌రైన వివిధ దేశాల ప్ర‌తినిధులకు ప్ర‌ధాని మోడి అభినంద‌న‌లు తెలిపారు.  స్వ‌ర్ణోత్స‌వాల లోగోను, స్టాంప్‌ను ప్ర‌ధాన‌మంత్రి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ‌త 50 ఏళ్లుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న ఇక్రిశాట్ ఉద్యోగుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. వ‌చ్చే 25 ఏళ్ల‌లో చేసే కార్య‌క్ర‌మాల‌పై ల‌క్ష్యం నిర్దేశించుకోవాల‌ని సూచించారు. వాతావ‌ర‌ణ మార్పుల‌కు త‌ట్టుకునే వంగ‌డాలు త‌యారు చేయాల‌న్నారు. తెలుడు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ ప‌రిశోధ‌న‌లు దోహ‌దం చేయాల‌ని ప్ర‌ధాని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.