అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం: 9మంది మృతి

అనంత‌పురం (CLiC2NEWS): జిల్లాలో కారు, లారీఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌ర‌ణించిన వారిలో ఆరుగురు మ‌హిళలు, ఒక బాలుడు, ఇద్ద‌రు పురుషులు ఉన్నారు. అనంత‌పురం-బ‌ళ్లారి జాతీయ ర‌హ‌దారిపై కొటాల‌ప‌ల్లి స‌మీపంలో ఇన్నోవా కారు ప్ర‌మాదానికి గురైంది. కారులో ఉన్న‌వారంతా బ‌ళ్లారిలో వివాహానికి హాజ‌రై తిరిగి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.