గురుకుల కాలేజీ విద్యార్థుల ప్రతిభకు కెటిఆర్ ప్రశంసల జల్లు
హైదరాబాద్ (CLiC2NEWS): గురుకుకాలాల్లో చదివిన విద్యార్థులు ఎమ్‌బిబిఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మొడికల్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా సీట్లు పొందిన విద్యార్థులపై రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కెటిఆర్ ప్రశంలసల జల్లు కురిపించారు. గడిచిన ఆరు సంవత్సరాలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలలో చదివిన విద్యార్థులు 512 మందికి పైగా మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, ఈ శాఖకు సంబంధించిన బృందానికి కెటిఆర్ అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు.