RESPECT Women: జీవిత కాలపు పొరల్లో..
జీవిత కాలపు పొరల్లో..
కప్పబడిన శిథిలమైన శిథిలాలెన్నో ఉన్న..
నిరంతరం గల గల పారుతున్న గోదావరీ మహిళా..!
మహిళ కళ్ళాలను తన గుప్పెట్లో
చిక్కించుకోని వెర్రి వేషాలు వేస్తున్నా…
నిరంతరం గల గల పారుతున్న కృష్ణమ్మ మహిళా..!
మహిలో మహిళ బరువు బాధ్యతలను భుజానకెత్తుకొని రాట్నంలా గిరి గిరా తిరగకపోతే నేల నింగి ఆగిపోతాయి..!
వినా స్త్రీ యా జననం నాస్తి
వినా స్త్రీ యా గమనం నాస్తి
వినా స్త్రీ యా జీవం నాస్తి
వినా స్త్రీ యా సృష్టియేవ నాస్తి.
జటాజూటములో గంగను ధరించిన గంగాధరుడు.
ఒక తాత్త్విక సత్యాన్ని మనకు గుర్తు చేయడానికే
పార్వతిని మాతను తన శరీరంలో భాగంగా చేసుకొని
అర్ధ నారీశ్వర రూపం ధరించాడు.
భోళాశంకరుడే మహిళలకు అంత ప్రముఖ స్థానం ఇస్తుంటే మనం ఎంత ఒక్కసారి ఆలోచించండి.
కనుక దయచేసి మహిళలను గౌరవించండి.
-మంజుల పత్తిపాటి