Mancherial: మంచిర్యాలలో బాల్కసుమన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
మంచిర్యాల (CLiC2NEWS): టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు, పార్లమెంట్ వేదికగా తెలంగాణపై మోడీ అహంకారపూరితమైన మాటలకి వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లాలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దివాకర్‌రావు ఆధ్వర్యంలో టిఆర్ ఎస్ నాయకులు నల్ల కండువాలతో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం ఐబి చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలో నల్లా జెండాలు, బ్యాడ్జీలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లాల్లోని క్యాతనపల్లి, భీమారం మండలం, చెన్పూరు, కోటపల్లి, మందమర్రి పట్టణంలో నల్ల బ్యాడ్జిలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, పార్లమెంట్ వేదికగా తెలంగాణపై మోడీ అహంకారపూరితమైన మాటలకి వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నల్ల కండువాలతో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. #ModiEnemyOfTelangana pic.twitter.com/DHhXMO0nwk
— Balka Suman (@balkasumantrs) February 9, 2022