మోడీ వ్యాఖ్యలపై న్యాయవాదుల నిరసన..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. మోడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది సాధిస్తుంటే బిజెపి నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు మోడి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.