ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి: వైఎస్ఆర్సిపి ఎంపీలు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలని వైఎస్ ఆర్సిపి ఎంపీలు అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీలు మార్గాని భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్ మాట్లాడారు. ఎపి విభజన హామీలపై 8 సంవత్సరాలుగా పోరాడుతున్నామని, కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని బిజెపి సరిదిద్దాలన్నారు. గతిశక్తి పథకం నిధులను ఎపి విభజన హామీలకు ఖర్చు చేయాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ పేదలు, రైతులకు వ్యతిరేకమని అన్నారు. ఫెర్టిలైజర్స్ సబ్సిడీని 25% తగ్గించి రైతులకు అన్యాయం చేశారన్నారు. పిఎం గరిబ్ అన్న యోజన పథకం ప్రస్తావన బడ్జెట్లో లేదు, ఉపాధి హామీ పథకానికి, గ్రామీణాభివృద్ధి పథకాలకు కూడా కేటాయింపులు తగ్గించారన్నారు. కరోనా సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా బడ్జెట్ ఉండాని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా సూచించారని, కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సి ఉండగా.. సబ్సిడీల్లో కోత పెట్టారని అన్నారు.