ఎపి సిఎం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల భేటీ

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డితో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స‌మావేశ‌మ‌య్యారు. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తో పాటు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై సిఎంకు వివ‌రించ‌నున్నారు. క‌రోనా, ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా సినిమాలు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిన‌దే. క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో పెద్ద సినిమాలు విడుద‌ల‌కు డేట్స్ ఖ‌రారు చేసిన‌వి. ఈ త‌రుణంలో ఎపిలో సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చించేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సిఎంను క్యాంప్ కార్యాల‌యంలో భేటీ ఆయ్యారు. ఈ స‌మావేశంతో స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ స‌మావేశంలో చిరంజీవి, మ‌హేశ్‌బాబు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, పోసాని కృష్ణ ముర‌ళి త‌దితురులు పాల్గొన‌నున్నార‌ని స‌మాచారం.

 

 

 

Leave A Reply

Your email address will not be published.