రాష్ట్రంలో ఏప్రిల్ నుండి కొత్త ఫించ‌న్లు.. !

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఏప్రిల్ నెల నుండి కొత్త పింఛ‌న్లు అంద‌జేస్తామని పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది. పరిశ్ర‌మల శాఖామంత్రి కెటిఆర్ ప్ర‌క‌టించారు. ఇబ్ర‌హీప‌ట్నం బ‌హిరంగ స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించి, కొత్త‌వి మంజూరు చేస్తామ‌ని తెలిపారు. గ‌తంలో ల‌బ్ధిదారులు 29 ల‌క్ష‌ల మంది ఉండేవార‌ని.. అద‌నంగా మ‌రో 11 లక్ష‌ల‌ మంది ఉన్నార‌ని అన్నారు. మొత్తం 40 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్ అంజేయ‌నున్నామ‌ని తెలియ‌జేశారు.

టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం అమ‌లులోకి వ‌చ్చాక రాష్ట్రంలో అభివృద్ది-సంక్షేమం అమ‌ల‌వుతున్నాయ‌ని మంత్రి తెలిపారు. ఇబ్ర‌హీప‌ట్నంలోని మూడు మున్సిపాలిటీల‌కు రూ. 221 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. డ‌బ‌ల్ బెడ్‌రూం ఇండ్లు, క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ వంటి ప‌థ‌కాల‌తో పేదింటి బ‌రువు త‌గ్గించార‌ని, మ‌న ఊరు-మ‌న‌బ‌డి ప‌థ‌కం ద్వారా 26 వేల బ‌డుల రూపురేఖ‌లు మారుతున్నాయ‌ని మంత్రి తెలిపారు. ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ ద్వారా 16 వేల‌కోట్లు, ఓవ‌ర్సీస్ విద్యా నిధి ద్వారా ఒక్కొక్క‌రికి రూ. 20 ల‌క్ష‌లు ఇస్తున్నామ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌తో మంచినీళ్లు అందిస్తున్నామ‌ని, టిఆర్ ఎస్ హ‌యాంలోని కోతల్లేని విద్యుత్ సాధ్య‌మ‌ని అన్నారు. కేంద్రం ప్ర‌క‌టించిన సంస‌ద్ ఆద‌ర్స్ గ్రామ‌యోజ‌న‌లో దేశంలో ఉత్త‌మంగా నిలిచిన మొద‌టి 10 గ్రామాల‌లో 7 గ్రామాలు తెలంగాణ‌కు చెందిన‌వే అనితెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.