ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ములుగు (CLiC2NEWS): జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోను డిసిఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగింది.