AP: ఇంటర్ ప్రాక్టికల్స్ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు
అమరావతి (CLiC2NEWS): ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని తీసుకొస్తూ ఇంటర్ బోర్టు తీసుకున్న నిర్ణయంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వేర్వేరు కళాశాలల్లో ప్రాక్టికల్ ఎక్జామ్స్‌కు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ఎపి ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది. దీంతో పాత విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు జరిగే అవకాశముంది.