రెండు రోజుల్లో పెళ్లి.. ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వ‌ధూవ‌రుల‌పై తేనెటీగల దాడి

రంగారెడ్డి (CLiC2NEWS): ప్ర‌స్తుత కాలంలో ఏ చిన్న వేడుకైనా ఫోటోషూట్ లేకుండా జ‌ర‌గ‌టంలేదు. పుట్టిన రోజులు, పెళ్లిళ్లకైతే ఇక చెప్ప‌న‌వ‌స‌రంలేదు. కొత్త జంట‌లు ప్రీ వెడ్డింగ్ షూట్ అంద‌రికంటే వినూత్నంగా ఉండాల‌ని భావిస్తున్నారు. దానితో ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబుతున్న పెళ్లికొడుకు, పెళ్లికూతురిపై తేనెటీగ‌లు దాడి జ‌రిగింది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

రంగారెడ్డి జిల్లా కొహెడ‌లో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న స‌మ‌యంలో తేనెటీగ‌ల దాడి జ‌రిగింది. దీంతో వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల్లో పెళ్లి.. ఇలా జ‌ర‌గటంతో ఇరు కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.