భారత బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయం..
థామస్ కప్ విజేతగా భారత్
బ్యాంకాక్ (): భారత్ థామస్‌కప్ విజేతగా నిలిచింది. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై భారత్ చారిత్రక విజయాన్ని సాధించి చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత్ విజయం సాధించింది. థామస్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం రెండు డబుల్స్, మూడు సింగిల్ మ్యాచ్‌లు ఉంటాయి. వరుసగా మూడింటిలో భారత్ గెలుపొందింది.
లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలిపింక్స్ రజత పతక విజేత ఆంథోనీ గింటింగ్‌పై 1-0 ఆధిక్యం సాధించాడు. డబుల్స్‌లో 18-21, 23-21, 21-19 తేడాతో భారత్ దూసుకెళ్లింది. సాత్విక్, చిరాగ్ శెట్టి జోడి 2-0 తో విజయం సాధించింది. ఆఖరి గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 వరుస సెట్లతో జొనాతన్ క్రిస్టీని 3-0 ఆధిక్యంతో ఓడించి భారత్ జట్టుకు విజయం చేకూరేలా చేశాడు.