కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ యాత్ర..
ఉదయ్‌పూర్ (CLiC2NEWS): కాంగ్రెస్‌కు కొత్త ఉషోదయం రానుందని సోనియా గాంధీ అన్నారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. పార్టీ బలోపేతానికి దేశవ్యాప్తంగా ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నవసంకల్ప చింతన శిబిరంలో ముగింపు కార్యక్రమంలో సోనియా మాట్లాడారు. గాంధీ జయంతి ( అక్టోబర్ 2)ని పురస్కరించుకొని ఆరోజు నుండి ఈ పాదయాత్ర కొనసాగించినున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లోని సీనియర్ల నుండి జూనియర్ల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.