లుంబినీని సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు..
ఖాట్మాండు (CLiC2NEWS): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నేపాల్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ బుద్ద పూర్ణిమ సందర్బంగా లుంబినీలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా తో కలిసి మాయా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశోక స్తంభంపై దీపం వెలిగించారు. లుంబినీ వనంలోని బౌద్ధ విశ్వవిద్యాలయంలో భారతీయ ప్రొఫెసర్ నియామకంతో పాటు అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరుగుతున్నాయి. మోడీ లుంబినీ వనంలో దాదాపు 5 గంటల పాటు పర్యటించనున్నారు. కాగా భారత ప్రధాన మంత్రి లుంబినీని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ రోజు ఉదయం లుంబినీ వనంలో దిగిన ప్రధానిని దేవ్‌బా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ బుద్ధ పూర్ణిమ నాడు మాయా దేవి ఆలయంలో ప్రార్థనలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బుద్ధ భగవానుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు. సంపన్నంగా ఉండేలా చేస్తాడు.“ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
I feel blessed to have prayed at the Maya Devi Temple on Buddha Purnima. May Lord Buddha bless us all and make our planet peaceful and prosperous. pic.twitter.com/hLJhZlHNL1
— Narendra Modi (@narendramodi) May 16, 2022