Bahar Ali: కొబ్బరి చెట్టు గురించి..
కొబ్బరి చెట్టుని హిందీలో నారియల్ అని, తెలుగులో కొబ్బరి చెట్టు అని, సంస్కృతంలో నారికేలా అని అంటారు.
కొబ్బరి చెట్టుకి ఉయ్యాలో ఉయ్యాలా, ఉయ్యాలేసి ఊగాలి జంపాల..ఓయమ్మా లాల, ఓయబ్బా లాల,ఊంగ ఊంగ ఊంగా ఊంగా ఇది పాట,.పాట వినటానికి ఎంత మధురంగా ఉంటుందో, కొబ్బరి నీరు తాగితే అంతే మధురంగా ఉంటుంది.happy గా ఉంటుంది. ఎండాకాలం లో కొబ్బరి నీరు తాగితే చాలా ఆనందంగా ఉంటుంది.
కొబ్బరి ఆరోగ్యానికి, శక్తికి, శాంతకి , బలానికి, తృప్తికి మూలమైనది. కొబ్బరి చెట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచుతారు. కొబ్బరి చెట్టు వలన మనకు చాలా ఉపయోగాలున్నాయి. కొబ్బరి మట్టలు, కొబ్బరికాండం, కొబ్బరి పీచు, కొబ్బరికాయలు, పుష్పములు, మరియు తైలం, అన్నీ అవసరమే, ఇది ఎన్నో రకాలుగా
ఉపయోగపడుతుంది.
కొబ్బరి లో స్నిగ్ధ, మధుర, శీతవీర్యం, మధురవిపాకం, వాతపిత్తహారం, బల్యం, హృదయ మరియు వస్తి శోధన కర్మలు కల్గి వుంది. దీనిలోపల పోటాసియం, సోడియం, మెగ్నీషియమ్, క్లోరిన్, విటమిన్ b, విటమిన్ c, నియాసిన్, ఐరన్, ఫోస్పోరస్, కాల్షియం, మినరల్ మేటర్, ఫైబర్, కార్భోహైడ్రేట్స్, క్రొవ్వు, ప్రోటీన్,తేమ ఉంటాయి.
ఇంకా ఇందులో అమైనో ఆసిడ్స్, అర్జీనిన్, ఐసొల్యూసిన్ లైసిన్, మితియోనిన్,త్రియోనిన్, వ్యాలిన్, హిస్టిడిన్, ల్యూసిస్, సిస్టిన్, ఫినైలలనిన్, ట్రిప్టోపాన్ వున్నాయి.

ప్రయోజనాలు:
- పచ్చి కొబ్బరి మధుమేహరోగులకు మంచి ఆహారం, ప్రోటీన్ లోపం వలన బాధపడే పిల్లలకు కొబ్బరి చక్కని బలమైన ఆహారం.
కొబ్బరినీరు తృప్తినిస్తాయి. దాహన్ని తిరుస్తాయి. వృద్ధులకు చక్కని ఔషాదంగా పనిచేస్తుంది. - ఎండాకాలం లో కొబ్బరినీరు తాగితే దప్పిక తీరుస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. వేడిని తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. వీర్యవృద్ధి చేస్తుంది. శిర రోగాలు తగ్గిస్తుంది.
- మూత్ర రోగాలు ఉంటే చక్కగా పని చేస్తుంది. వేడితో మూత్రం రాకపోతే కొబ్బరినీరు తాగితే మూత్రం చక్కగా వస్తుంది.
- డిహైడ్రేషన్ అయితే కొబ్బరి నీళ్లు మరియు నిమ్మకాయ నీళ్లు చిటికెడు ఉప్పు కలిపి తాగితే డిహైడ్రేషన్ తగ్గుతుంది.
- పళ్ళు దృడం గా ఉండాలంటే కొబ్బరి మరియు బెల్లం కలిపి తింటే రుచిగా ఉంటుంది. మరియు బాగా నమిలి తినటం వలన పళ్ళు కూడా గట్టిపడతాయి.

- గుండె జబ్బులు, ఏసీడీటీ, జ్వరాలు వున్నవారు , గర్భిణీ స్త్రీలు, కొబ్బరి నీరు వాడటం చాలా మంచిది. ఇందులో పోటాషియం, క్లోరిన్ ఎక్కువ మోతా దులో ఉంటుంది. కొబ్బరి నీరు తాగితే మూత్రం చక్కగా వస్తుంది.
- పరిగడుపున ఒక వారం కోబ్బరి నీరు తాగితే గ్యాస్, ఏసీడీటీ, మలబద్ధకం,పోతుంది.
- చిన్న పిల్లల ఎదుగుదలకు పచ్చికొబ్బరి మరియు పండిన అరటిపండు తినిపిస్తే చక్కని ఆరోగ్యవంతులుగా వుంటారు.
- శరీరానికి కొబ్బరినూనె రాసుకుంటే మృధువుగా ఉంటుంది.
- కొబ్బరి నూనే తల జుట్టుకు రాస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. వెంట్రుకలు ఏపుగా పెరుగుతాయి. కుదుళ్ళు గట్టిబడతాయి. కంటికి చలువ, నెత్తి చలువ, అన్ని రకాల తలనొప్పిలు పోగొడుతుంది ముఖంలో తేజజం వస్తుంది. త్వరగా ముసలి ముఖం కాకుండా చర్మం సౌందర్యవంతముగా ఉంచుతుంది.
- కొబ్బరిపాలు వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.
- అంతేకాకుండా ఎండాకాలంలో వ్యర్థమైన జ్యూసులు, కూల్డ్రింక్స్, టీ, కాఫీ లు తాగే బదులు కొబ్బరినీరు తాగండి.ఆరోగ్యంగా వుంటారు. Xlent గ్లామర్ వస్తుంది. కడుపులో అల్సర్, ఏసీడీటీ, గ్యాస్, టైఫాయిడ్, స్మాల్ఫాక్స్, చికెన్ ఫాక్స్, రక్త, నీళ్ల విరోచనాలు,డిఫ్తిరియా, బ్రాంకైటీస్, అర్షమొలలకు,బలహీనలకు, వృద్ధులకు, చక్కగా ఇవ్వవచ్చును.ఇది పొత్తి కడుపు నొప్పి తగ్గిస్తుంది. వాతాన్ని పోగొడుతుంది.
- స్పెషల్ చిట్కా.. కొబ్బరి నీరు తాగిన వారు ..స్త్రీతో .. వలన అలసిన వారికీ శక్తినిస్తుంది. బాగా లెక్చరర్ దంచేవాళ్లకు అధికంగా ఉపవాసం వుండే వారికి కొబ్బరి నీళ్లు శక్తిని ఇస్తాయి.
- చివరగా సమ్మర్లో కూల్డ్రింక్స్ మరియు జ్యూస్ తాగకుండా కొబ్బరి నీరు తాగండి.
–షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు