ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌..

ఢిల్లీ (CLiC2NEWS): నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈసి షెడ్యూల్ విడుద‌ల చేసింది. మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో ఖాళీ అయిన స్థానంలో జూన్ 23న పోలింగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దేశ‌వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్‌స‌భ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక‌లు జ‌రిపేందుకు బుధ‌వారం షెడ్యూల్ విడుద‌లైంది.

సంగ్రూర్ (పంజాబ్‌), రాంపూర్‌, అజంగ‌ఢ్‌(యూపి),లలో పార్ల‌మెంట్ స్థానాల‌కు, అగ‌ర్త‌లా, టౌన్ బోర్డోవ‌లి, సుర్మా, జుబ‌రాజ్ న‌గ‌ర్ (త్రిపుర‌), ఆత్మ‌కూరు (ఎపి), రాజింద‌ర్ న‌గ‌ర్ (ఢిల్లీ), మంద‌ర్ (ఝార్ఖండ్‌)ల‌లో అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.