గ్రూప్-1 దరఖాస్తుల గడువు పొడిగింపు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది. అభ్యర్థుల విన్నపం మేరకు మరో నాలు రోజులపాటు గడువును పెంచుతూ టిఎస్పిఎస్సి నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేయడానికి మే 31వ తేది చివరి రోజు. ఈ గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడుదలైన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 పోస్టులకు సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు గడువును పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.