నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా..
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మహిళల బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్, ఐఎస్ ఎస్ ఎఫ్ షూటింగ్లో ఇషా సింగ్ స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసినదే. వీరికి తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. నగదుతో పాటు ఇళ్ల స్థలాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. జూన్ 2 వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అదేవిధంగా పద్మశ్రీ కిన్నెర మెట్ల మొగిలయ్యకు రూ. కోటి నగదు పురస్కారంతో పాలు బిఎన్ రెడ్డి నగర్‌లో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.