క‌రోనా విజృంభ‌ణ‌పై ఐదు రాష్ట్రాల‌కు కేంద్రం అలెర్ట్‌

మ‌ళ్లీ పంజా విసురుతోన్న క‌రోనా..

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్యలో క్ర‌మంగా పెరుగుద‌ల న‌మోద‌వుతోంది. కాగా క్రీయాశీల కేసుల సంఖ్య దేశంలో 21 వేలు దాటింది.

ఈ మేర‌కు దేశంలో ని ప‌లు రాష్ట్రాల‌ను కేంద్రం అలెర్టు చేసింది. ముఖ్య‌మంగా త‌మిళ‌నాడు, కేర‌ల‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో స్థానికంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొంది. ఈ మేర‌కు ఈ ఐదు రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ రాసింది.

“క‌రోనా వైర‌స్ పై చేస్తున్న పోరులో మ‌రింత జాత్ర‌గా ఉండాలి. ముఖ్యంగా ప్ర‌జారోగ్యం విష‌యంలో ముప్పు అంచ‌నా ఆధారిత విధానాన్ని పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ క్ర‌మంలో క‌రోనా నిర్ధారిత టెస్టుల సంఖ్య పెంచ‌డం, జినోమ్ సీక్వెన్సింగ్ చేప‌ట్ట‌డాన్ని ముమ్మ‌రంగా చేయాలి. వైర‌స్ వ్యాప్తి తీరును ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టాలి“

అని ఐదు రాష్ట్రాల‌కు రాసిన లేఖ‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.