ప్రపంచ సైకిల్‌ దినోత్సవ శుభాకాంక్షలు

పిటి ఉషా లాగా పరుగులు తీసే సైకిలు గుర్తున్నాదా!

అమ్మానాన్న లాంటి రెండు చక్రాల సైకిలు గుర్తున్నాదా!

జీవితంలో ముందుకు మాత్రమే పరిగెత్తు అని గుర్తు చేసే సైకిలు గుర్తున్నాదా!

కాలుష్య విషం చిమ్మనీ రెండు చక్రాల సైకిలు గుర్తున్నాదా!
పసి పిల్లలకు ఆరోగ్యం ఆనదం ఇచ్చే రెండు చక్రాల సైకిలు గుర్తున్నాదా!

కాంచీ తొక్కుతూ కింద పడి లెస్తున్న పిల్లలకీ జీవిత పాఠాలు బోధించే రెండు చక్రాల సైకిలు గుర్తున్నాదా!
సీటు ఎక్కి కూర్చుని రాజోలే చూపులు చూస్తూన్న పిల్లలకీ
రేపటి రాజువి నువ్వే కావాలి అని గుర్తు చేస్తున్నా రెండు చక్రాల సైకిలు గుర్తున్నాదా!

డబ్బున్న వాడి పొట్ట తగ్గించి లేని వాడి పొట్ట నింపే రెండు చక్రాల సైకిలు గుర్తున్నాదా!

ప్రపంచ సైకిల్‌ దినోత్సవ శుభాకాంక్షలు

-మంజుల పత్తిపాటి
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

Leave A Reply

Your email address will not be published.