కంటి సమస్యలు- నివారణ

మనకు ఏ కారణం చేతనైనా ఏడుపు వస్తే వెంటనే మనకు కన్నీళ్లు వస్తాయి. బాధ తీవ్రతను బట్టి ఏడుపు ఎక్కువగా వస్తుంది. మనకు వచ్చే కన్నీటిని బలవనతంగా ఆపకూడదు. బాగా కళ్ళల్లో నుంచి నీరు కారిన తరువాత గుండె బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. బాగా ఏడ్చి కన్నీరు కార్చే వారికి ఛాతీ సంబంధమైన సమస్యలు, గుండె సమస్యలు చాలా తక్కువగా వుంటాయని పరిశోధనల్లో తేలింది కన్నీటిని ఆపితే అది జలుబుగా మారి కళ్ళలో నొప్పులు, మీద నొప్పి తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకని సహజంగా ఏడుపు వచ్చినప్పుడు మాత్రం ఆప కూడదు. కొన్ని నంది వర్ధనం చెట్టు పూలు (తెల్లని రిక్క పూలు లేదా ముద్ద పూలు) కడిగి నీటిలో వేసి రెండు గంటల తరువాత ఆ నీటిలో కళ్ళు కడుక్కుంటే కళ్ళలో మంట తగ్గి, తేటగా అవుతాయి. పూలు కంటిపై పెట్టుకుని చిన్న గుడ్డ కప్పి కొద్ది సేపు పడుకుంటే వెంటనే తగ్గి పోతుంది.

కంటికి నిద్రకు అవినాభావ సంబంధం ఉంటుంది. కంటి నిండా నిద్రపోవడం అనేది ఒక అదృష్టం. ఏ రకమైన మానసిక సమస్యలు ఉన్నా నిద్ర సరిగా పట్టదు పెద్ద వారు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు. నిద్ర పోవాలి. చిన్న పిల్లలు 10 నుంచి 12 గంటలు నిద్ర పొతే వారి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. గాఢ నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే నిద్ర ఆపితే కాను గుడ్లు ముఖం పీక్కు పోయినట్లుంటుంది. చురుకుదనం కోల్పోతారు. ఏకాగ్రత లోపిస్తుంది. శరీర కాంతి తగ్గి పోతుంది. అజీర్తి గ్యాస్ సమస్యలు వస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా నిద్ర లోపిస్తే కన్నులపై ప్రభావం పడుతుంది. కొద్దిగా త్రిఫలా చూర్ణం రాత్రి నీటిలో నాన పెట్టి ఉదయం వడపోసి కళ్ళు కడుక్కుంటే నేత్ర సమస్యలు తగ్గుతాయి. త్రిఫలా చూర్ణం +నెయ్యి + తేనే కలిపి నాకితే కంటి చూపు మెరుగవుతుంది. కొన్ని మారేడు ఆకులు నీటిలో మరిగించి తేనే కలిపి తాగాలి . కంటి చూపు శక్తి పెరుగుతుంది. రేచీకట్ల సమస్య కూడా తగ్గి పోతుంది.

 

కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు అరికాళ్ళ పాదాలకు ఆవనూనెతో మర్దనా చేయాలి. నేత్ర సమస్యలు రావు. . కళ్ళలో మంటలు వస్తుంటే కొన్ని జామాకులను ముద్దగా దంచి నూరి పడుకునే ముందు కళ్లపై కట్టుకుని పడుకోవాలి. మంటలు తగ్గి పోతాయి. చిన్న పిల్లలకు కంటి చూపు లోపం లేకుండా ఉండాలంటే ప్రతి రోజు 2 నుంచి 4 బాదాం పప్పులను నానపెట్టి పొత్తు తీసి తినిపించాలి. క్యారెట్ ను ఆహారం లో చేర్చుకోవాలి. అప్పుడప్పుడు కళ్ళు మంటలుగా ఉంది ఎర్రబడతాయి. ఎడమ కాని ఎర్రబడితే కుడికాలి బొటన వేలుకు, కుడికన్ను ఎర్రబడితే ఎడమ కాలి బొటన వెలికి సున్నం రాసుకుని పడుకోవాలి. కళ్ళలోని ఎరుపు తగ్గి పోతుంది.

 

 

కళ్ళ కలక వలన కన్ను ఎరుపెక్కడమే కాకుండా కనురెప్పలు రెండు అటుక్కుపోతాయి . కళ్ళలో మంట , కన్నీరు కారడం వలన పై తెల్లని ఊసులు ఏర్పడి ఇబ్బంది పెడతాయి. ఇది అంటు వ్యాధి దీనికి దురద కూడా ప్రధానంగా ఉంటుంది. పటికను వేడి నీటిలో కరిగించి కళ్ళు కడుక్కొని శుభ్రమైన దూదితో తుడుచుకోవాలి. ఆవునెయ్యిలో పంచ దార కలిపి రోజుకు మూడు సార్లు తినాలి. త్రిఫలా కషాయాన్ని పాలతో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. తగ్గి పోతుంది. అతిగా టివి చూడటం వలన సెల్ ఫోన్ చూడటం వలన కనుగుడ్లు అలసట చెంది కాను రెప్పలపై కురుపులు, చిన్న చిన్న గడ్డలు తయారవుతాయి. విటమిను ఏ. డి. కంటికి ఉపయోగ పడే విటమినులు . పొన్నగంటి కూర ను తరచూ ఆహారం లో ఉపయోగించాలి. అదేవిధంగా . బొప్పాయి పండు క్యారట్ కామంచి చెట్టు ఆకులు, చిన్న చిన్న పళ్ళు తినాలి. కామంచి ఆకుల కాషాయం తాగాలి.

 

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగ ముద్రలు కూడా ఎంతో సహాయ పడతాయి. మనం కంటి సమస్యల పై చర్చిస్తున్నాం కాబట్టి కంటి సమస్యలు రాకుండా ;పనికి వచ్చే యోగ ముద్రల గురుంచి తెలుసుకుందాం.. మొదటిది, జ్ఞాన ముద్ర లేక ధ్యాన ముద్ర చూపుడు వేలు, బొటన వేలు కలిపి గట్టిగా నొక్కి పట్టి ఉంచి మిగతా మూడు వేళ్ళు చక్కగా ఉంచి సుఖాసనం లో కొద్దీ సేపు కూర్చోవాలి. దీనితో ఏకాగ్రత పెరుగుతుంది.

చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చురుకుదనం తెలివి తేటలు పెరుగుతాయి. మోదా శక్తి పెరుగుతుంది. దీని తర్వాత వేయాల్సిన ముద్ర రెండవది ప్రాణ ముద్ర, చిటికెన వేలు ఉంగరపు వేలు, బొటన వేలు ఈ మూడు వేళ్ళు కలిపి నొక్కి పట్టి ఉంచాలి. శరీరంలో ఉన్న ప్రాణ శక్తి ఉత్తేజం అవుతుంది. శక్తి సమకూరుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కంటి సమస్యలు రానివ్వదు . దృష్టి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. త్వరగా అలసట రాదు. ఆకలి దప్పులకు ఓర్చుకునే శక్తి పెరుగుతుంది. అందుకని. జ్ఞాన ముద్ర లేక ధ్యాన ముద్ర తరువాత ప్రాణ ముద్ర కూడా వేస్తె కంటి శక్తి పెరిగి, ఏకాగ్రత పెరిగి చిన్న పిల్లలు, పెద్ద వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

-పి.కమలాకర్ రావు

Leave A Reply

Your email address will not be published.