ఏపీలో కొత్త‌గా 5292 కరోనా కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,944 మందికి కరోనా న‌మూనాలు పరీక్షించ‌గా 5,292 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,39,719గా ఉంది. కరోనా నుంచి కొత్తగా 6,102 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,84,930గా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 42 మంది మృతి చెందగా.. ప్ర‌కాశం జిల్లాలో 6 మంది, చిత్తూరు 5, తూర్పు గోదావ‌రి 5, అనంత‌పురం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో న‌లుగురుచొప్పున‌, గుంటూరు, క‌డ‌ప‌, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. క‌ర్నూలు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌, విజ‌య‌నగ‌రంలో ఒక‌రు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో మొత్తంగా రాష్ట్రంలో 6,128 కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 63,49,953 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 1,18,913మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 11.65గా ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.