రిల‌య‌న్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా

ముంబ‌యి (CLiC2NEWS): ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ త‌మ కంపెనీ టెలికాం విభాగ‌మైన జియో బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డుకు రాజీనామా చేశారు. ఈ కంపెనీ ప‌గ్గాల‌ను త‌న‌యుడు ఆకాశ్ అంబానీకి అప్ప‌గించారు. ఈ మేర‌కు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సంద‌ర్బంగా రిల‌య‌న్స్ జియో వెల్ల‌డించింది. అయితే జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్‌కు ముకేశ్ ఛైర్మ‌న్‌గా కొన‌సాగ‌నున్నారు.

జూన్ 27వ తేదీన అంబానీ రిల‌య‌న్స్ జియో డైరెక్ట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు కంపెనీ తెలిపింది. దీంతో సోమ‌వారం జ‌రిగిన బోర్డు స‌మావేశంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్‌గా ఉన్న ఆకాశ్ అంబానీని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ ఛైర్మ‌న్‌గా నియ‌మించిన‌ట్లు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.