అమ‌రావ‌తి స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి ర‌ద్దు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యం శాఖాధిప‌తుల కార్యాల‌యాల్లోని ఉద్యోగుల‌కు క‌ల్పిస్తున్న ఉచిత గృహ‌వ‌స‌తి సౌక‌ర్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. రేప‌టిలోగా ప్ర‌స్తుతం ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్ల‌ను ఖాళీ చేసి ఇవ్వాల‌ని సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్ప‌గించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఏమైనా న‌ష్టం జ‌రిగితే సంబంధిత ఉద్యోగుల‌తే బాధ్య‌త‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నుండి అమ‌రావ‌తికి వ‌చ్చిన ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 2017 నుండి ఉచిత వ‌స‌తి క‌ల్పిస్తూ వ‌చ్చింది. తాజాగా ఉచిత వ‌స‌తిని ర‌ద్దు చేసింది.

Leave A Reply

Your email address will not be published.