రాష్ట్రంలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతర.. గురువారం అంగరంగ వైభవంగా |అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు నిర్వహించనున్నారు. గోల్కొండ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.