మ‌హారాష్ట్ర సిఎంగా ఏక్‌నాథ్ శిండే .. నేడు ప్ర‌మాణం

మ‌హారాష్ట్ర (CLiC2NEWS): రాష్ట్రంలో త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిండే బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర మాజీ సిఎం, బిజెపి నేత దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ గురువారం వెల్ల‌డించారు. గురువారం ఫ‌డ‌ణ‌వీస్‌, శిండే క‌లిసి గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారీని క‌లిశారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజార్టి త‌మ‌కు ఉంద‌ని, అందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. అనంత‌రం ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఈ సాయంత్రం 7.30 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో శిండే సిఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు ఫ‌డ‌ణ‌వీస్ వెల్ల‌డించారు.

ఉద్ధ‌వ్ ఠాక్రే సిఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిన‌దే. ఠాక్రే వైదొల‌గ‌డంతో రాష్ట్రంలో మ‌ళ్లీ బిజెపి స‌ర్కారు ఏర్ప‌డుతుంద‌ని అంతా భావించారు. సిఎంగా ఫ‌డ‌ణ‌వీస్‌, డిప్యూటీ సిఎంగా శిండే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని వార్త‌లు కూడా వినిపించాయి.

ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Leave A Reply

Your email address will not be published.