TS: 24 గంట‌ల్లో అల్పపీడ‌నం.. 8 వ‌ర‌కు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రానున్న 24 గంటల్లో జార్ఖండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావ‌ర‌ణ కేంద్ర పేర్కొంది. బంగ్లా దేశ్ ప‌రిసరాల్లో ఉన్న ఉప‌రిత ఆవ‌ర్త‌నం ఆదివారం జార్ఖండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొన‌సాగుతూ స‌ముద్ర మ‌ట్టం నుంచి 5.8 కి. మీ. ఎత్తు వ‌ర‌కు విస్త‌రించి ఉంద‌ని పేర్కొంది. దీని ప్ర‌భావంతో 8వ తేదీ వ‌ర‌కు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఈ మేర‌కు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు జిల్లాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.