`తుంగభద్ర` భారీగా వరద
జోగులాంబ గద్వాల (CLiC2NEWS): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణటక, మహారాష్ట్ర, గుజరాత్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురస్తున్న వర్షాలతో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో టిబి డ్యామ్‌కు వరద ముంచెత్తుతోంది. మంగళవారం టిబి డ్యామ్‌కు 87,305 క్యూసెక్కుల ఎన్ఫ్లో వచ్చి చేరుతోంది. అవట్ ఫ్లో 1,649 క్యూసెక్కులు నమోదైంది. ఎగువన కురుస్తున్న భారీవర్షాల మూలంగా టిబి డ్యామ్‌కు భారీగా వరద వచ్చే అవకాశముందని టిబిడ్యామ్ సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ప్రస్తుతం డ్యామ్‌లో 95,314 టిఎంసిల నీటి నిల్వ ఉండగా.. 1630.30 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్టు ఆయన తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తుంగభద్ర తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తుంగభద్ర బోర్డు అధికారులు కర్ణాటక, ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను కోరాయి. ఈ మేరకు రెండో ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు.