ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
రాజమహేంద్రవరం (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో గోదావరి నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దాంతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లోని గోష్పాద క్షేంద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. భారీ వరదల మూలంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్‌ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా. బీఆర్. అంబేడ్కర్ సూచించారు.