రేపు గోదారి ప‌రివాహ‌క ప్రాంతాల్లో సిఎం కెసిఆర్ ఏరియ‌ల్ స‌ర్వే

హైద‌రాబాద్ (CLiC2NEW): తెలంగాణ సిఎం కెసిఆర్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆదివారం ఉద‌యం ఏరియల్ స‌ర్వే చేయ‌నున్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా నెల‌కొన్న వ‌ర‌ద న‌ష్టం, గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లో పోటెత్తిన వ‌ర‌ద‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్షించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని క‌డెం ప్రాజెక్టు నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాన్ని ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్నారు. ఈ స‌ర్వేలో సిఎం కెసిఆర్ తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పాల్గొనన్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ముంపు ప్రాంతాల్లోని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌రిశీలిస్తారు. ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌లో భాగంగా వ‌ర‌ద‌ల వ‌ల్ల అంటు వ్యాధులు ప్ర‌భ‌ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లోని ఆసుప‌త్రుల‌కు చెందిన వైద్యులు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో తెలంగాణ వైద్య మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌త్యంతో సంబంధిత కార్యాచ‌ర‌ణ‌పై వైద్యారోగ్య‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.