శాంతించిన గోదావ‌రి.. ఇంకా ముంపులోనే 200 గ్రామాలు..

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం (CLiC2NEWS): గోదావ‌రి న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చ‌డంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద ప్ర‌మాద‌క స్థాయిలో వ‌ర‌ద నీరు పోటెత్త‌న విష‌యం తెలిసిందే. భారీ వ‌ర‌ద‌ల‌తో ఉప్పొంగి ప్ర‌వ‌హించిన గోదార‌మ్మ శాంతించింది. మ‌హారాష్ట్రతో పాటు రాష్ట్రంలో అథిభారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో క‌డెం నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు గోదావ‌రి నదీ ప‌రీవాహ‌క ప్రాంతాలు వ‌రద నీరు భారీగా చేరింది. నిన్న సాయంత్రం భ‌ద్రాచ‌లం వ‌ద్ద 70.10 అడుగ‌ల‌కు చేరిన గోదావ‌రి నీటిమ‌ట్టం. ఇవాళ (శ‌నివారం) సాయంత్రానికి 69.4 అడుగుల వ‌ద్ద ప్ర‌వ‌హిస్తోంది. వ‌ర‌ద ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతోంద‌ని అధికారులు తెలిపారు.

కాగా గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో న‌దీ తీర ప్రాంతాలలోని పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని వంద‌ల గ్రామాల్లో విద్యుత్ ఉత్ప‌త్తి నిలిచిపోయింది. ముఖ్యంగా చ‌ర్ల‌, దుమ్ముగూడెం మండ‌లాల్లోని ప‌లు గ్రామాలు చీక‌టిలోనే ఉండిపోయాయి. దాదాపు 200 గ్రామాల‌కు మండ‌ల కేంద్రాల‌తో సంబంధాలు తెగిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.