India Corona: దేశంలో కొత్త కేసులు 20,044

న్యూఢిల్లీ (CLiC2NEWS): వ‌రుస‌గా మూడో రోజు 20 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 20,044 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 4,37,30,071కి చేరాయి. వీటిలో 4,30,63,651 మంది క‌రోనా నుంచి కోల‌కున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 5,25,660 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం దేశంలో 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 53 మంది క‌రోనాబారిన ప‌డి మృత్యువాత‌ప‌డ్డారు. 18,301 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.