ఎన్‌డిఎ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌..

ఢిల్లీ (CLiC2NEWS): ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అభ్య‌ర్థిగా ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ పేరును ప్ర‌క‌టించింది. ఈమేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో శ‌నివారం నిర్ణ‌యం తీసుకున్నారు. అనంత‌రం అభ్య‌ర్థి పేరును పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జెపి న‌డ్డా విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌క‌టించారు. రైతు బిడ్డ అయిన జ‌గ‌దీప్ ప్ర‌జ‌ల గ‌వ‌ర్న‌ర్‌గా పేరు తెచ్చుకున్నార‌ని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.