Commonwealth Games: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలిపతకం
బర్మింగ్‌హామ్ (CLiC2NEWS): కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలిపతకం సాధించింది. 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కేజీలు, స్నాట్చ్‌లో 113 కేజీలు ఎత్తాడు. మొత్తంగా 248 కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. మలేషియకు చెందిన మహమద్ అనిఖ్ 249 కేజీలను ఎత్తి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమా యోదగె మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం సాధించాడు.