మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన గాలులు వీచే ప్రభావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఎపి తీరంలో నెలకొని ఉన్న ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.