ప్రజలకు సిఎం కెసిఆర్ పంద్రాగస్టు కానుక
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు స్వాంతంత్ర్య దినోత్సవ (పంద్రాగస్టు) కానుక ప్రకటించారు. తెలంగాణలోని 57 యేళ్లు నిండిన వారికి ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 36 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఈ కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని జైళ్ల శాఖను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే కిడ్నీ వా్యధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే రోగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
“పాల మీద జిఎస్టీని రద్దు చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా.. అలాగే చేనేతపై జిఎస్టీ రద్దు చేయాలని కోరుతున్నా.. గాలిమీద తప్ప అన్నింటిపైనా కేంద్రం పన్ను వేస్తోంది. అల్పాదాయ వర్గాల వస్తువులపై జిఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలి. దేశ ఆర్ధిక ప్రగతిని కేంద్రం నాశనం చేస్తోంది. ఎఫ్ ఆర్ బిఎం పరిమితులపై ఆంక్షలు విధించారు. దీనిపై నీతి ఆయోగ్‌లో ఎందుకుచర్చించరో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పాలి. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చెబితే.. గోడకు చెప్పినట్లే.. అందుకే నిరర్దకమైన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనదలచుకోలేదు. ఇప్పడు 5 జి సెక్ట్రం సంగతి ఏంటి.. అప్పట్లో 2 జి సెక్ట్రంపై ఎంతో రాద్ధాంతం చేశారు. నైజ 5 లక్షల కోట్లకు అంచనాలు రూపొందిస్తే.. రూ.1.50 లక్షల కోట్లు మాత్రమే వస్తాయా? “ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు.