బిజెపి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్..
షోకాజు నోటీసులు జారీచేసిన అధిష్ఠానం
హైదరాబాద్ (CLiC2NEWS): ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేటు వేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బిజెపి అధిష్ఠానం నిర్ణయం తీసకుంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అలాగే పార్టీ శాసన సభాపక్ష పదవి నుంచి కూడా తొలగించింది. వచ్చే నెల (సెప్టెంబరు) 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ హైకమాండ్ కోరింది.