Kakinada: కేంద్రీయ విద్యాల‌యంలోని 50 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌!

కాకినాడ (CLiC2NEWS): కేంద్రీయ విద్యాల‌యంలోని విద్యార్థులు ఘాటైన వాస‌న పీల్చుకోవ‌డం వ‌ల‌న అస్వ‌స్థ‌త‌కు గురైనారు. పాఠ‌శాల‌లోని 5, 6 త‌ర‌గతి చ‌దివే విద్యార్థులు సుమారు 50 మంది వ‌ర‌కు ఊపిరాడ‌క తీవ్ర ఇబ్బందికి గురైయ్యారు. వారంద‌రిని బయ‌ట‌కు తీసుకొచ్చి స‌ప‌ర్య‌లు చేశారు. కొంత‌మంది విద్యార్థుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. ఘాటైన వాస‌న గ‌ల విష‌వాయువు పీల్చుకోవ‌డంతో విద్యార్థులు ఊపిరాడ‌క ఇబ్బందికి గుర‌య్యార‌ని ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. విద్యార్థుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని.. వారి ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.