సంగం, నెల్లూరు బ్యారేజిలను ప్రారంభించిన సిఎం జగన్
నెల్లూరు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంగం, నెల్లూరు బ్యారేజిలను ప్రారంభించారు. జిల్లాలోని సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని మేకపాటి కుటుంబ సభ్యులతో కలిసి సిఎం ప్రారంభించారు. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. సుమారు 140 ఏళ్ల కిందట బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన సంగం, నెల్లూరు బ్యారేజిలు కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకున్నాయని.. ఎంతమంది సిఎంలు వచ్చినా.. వాటిని పట్టించేకోలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బ్యారేజిలకు మోక్షం వచ్చిందని అన్నారు. శిథిలావస్థకు చేరకున్న ఈ బ్యారేజిల పునర్నిర్మాణానికి పూనుకున్నారని.. ఆయన మరణంతో ఈ పనులన్నీ ఆగిపోయినవని పేర్కొన్నారు. వాటిని పూర్తి చేసినందకు గర్వపడుతున్నానని జగన్ అన్నారు.
తిరిగి వైఎస్ ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లో వాటిని పూర్తి చేశామని.. ఈ బ్యారేజిలకు రూ.320కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ రెండిటి ద్వారా సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.