Delhi: దీపావళికి టపాసులపై నిషేధం
టపాసులపై నిషేధం జనవరి 1, 2023 వరకు అమలు
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం మిగతా నాగరాలలో కంటే అధికంగా ఉంటోంది. దీంతో ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా దీపావళి పండుగ సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే జనవరి 1, 2023 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
దీపావళి సందర్భంగా ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని.. ఆ రాష్ట్ర సర్కార్ టపాసుల అంక్షలు విధిస్తూ వచ్చింది. గత సంవత్సరం సెప్టెంబర్ 28 నుండి జనవరి1, 2022 వరకు బాణసంచా ఉత్పత్తులు, విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. ఈ సారి ఆన్‌లైన్ విక్రయాలపై కూడా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఈ నిషేధాన్నికఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.