అక్రమాలకు చెక్ పెట్టేందుకు అంగన్‌వాడీల్లో స్మార్ట్ సేవలు

అన్నమయ్య (CLiC2NEWS): ఎపిలోని అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నారు. ఈ స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే అవకతవకలు అరికట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని 2389 మంది కార్యకర్తలకు, 56 మంది సూపర్‌వైజర్లకు కలిపి 2445 సెల్‌ఫోన్లు మంజూరయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలు ప్రతిరోజు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దీనికోసం ప్రతి నెలా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని అంగన్ వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా స్మార్ట్ సేవలతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
I am a student of BAK College. The recent paper competition gave me a lot of headaches, and I checked a lot of information. Finally, after reading your article, it suddenly dawned on me that I can still have such an idea. grateful. But I still have some questions, hope you can help me.