దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. హత్యచేసి, ముక్కలుగా కోసి..
ఢిల్లీ (CLiC2NEWS): హత్య కేసు విచారణ చేస్తున్న సమయంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం చేస్తున్న భాగస్వామిని హత్యచేసి, 35 ముక్కలుగా కోసి నగరమంతా విసిరేశాడు ఓప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో మృతురాలు శ్రద్ధా, ఆఫ్తాబ్ అమీన్ కలిసి ఒక ప్లాట్‌లో కలిసి ఉంటున్నారు. శ్రద్ధా ముంబయిలోని ఓ ప్రముఖ కంపెనీలో కాల్ సెంటర్‌లో పనిచేసేది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి సహజీవనంలో ఉన్నారు. పెద్దవారికి తెలిసి వారి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ముంబయి నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య తరచూ పెళ్లి ప్రస్తావనపై గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో మే 18వ తేదీన అమీన్ శ్రద్ధాను హత్య చేశాడు. అప్పటి నుండి మృత దేహాన్ని దాచి పెట్టి, 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేశాడు.
మృతురాలుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం తలెత్తి.. ఢిల్లీలోని ఆమె ఉంటున్న నివాసంకు వెళ్లి చూడాగా తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అమీన్‌ను అరెస్టు చేశారు. తరచూ శ్రధ్దా పదేపదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గొడవలు జరిగేవని అమీన్ విచారణలో తెలిపాడు.
Thank you very much for sharing. Your article was very helpful for me to build a paper on gate.io. After reading your article, I think the idea is very good and the creative techniques are also very innovative. However, I have some different opinions, and I will continue to follow your reply.