ఆనందాల పండుగలు..!

పసి వయసు అల్లరి, ఆనందాల పండుగలు…!

పసి వయసు దాటిందంటే అంతా ఆందోళనల పండుగలు…!

పసి వయసు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు…!

పసి వయసు దాటిందంటే పూతోటలో రాలిపోయిన పువ్వులు…!

పసి వయసు చెరిగిపోని , చెరచ లేని, మరిచి పోని , మరుపు రాని మధుర మైన జ్ఞాపకాలు…!

పసి వయసు దాటిందంటే కదిపితే కందిరీగ తుట్ట,కదిలిస్తే కన్నీటి జల ప్రళయములు…!

-మంజుల పత్తిపాటి

Leave A Reply

Your email address will not be published.