శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
కనగానపల్లె (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పర్వతదేవరపల్లిలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కో్ల్పోయారు.
ఈ ప్రమాదంలో వరంగల్ జి్లలాకు చెందిన సా్ఫ్ట్వేర్ దంపతులు రమ్య, గోపీనాథ్ వారి పిల్లలు సాహిత్, హాసిని మరో బంధువు.. వీరంతా బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పర్వతదేవరపల్లికి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమ్య, గోపీనాథ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారి బంధువు తారకేశ్వరి (62) మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.