రాష్ట్రం కోసం నా ప్రాణాలైనా ఇస్తా.. : చంద్రబాబు
మంగళగిరి (CLiC2NEWS): రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టిడిపి వస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ‘ఇదేం ఖర్మ పేరిట’ చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత మూడున్నరేళ్ల కాలంలో ఎంతో విధ్వంసం జరిగిందని.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. కేవలం అధికారంలో ఉన్నపుడే కాకుండా.. ప్రతిపక్షంలో ఉన్నాకూడా బాధ్యతగా ఉన్నామని ఆయన తెలిపారు.
వచ్చే ఎన్నికలలో టిడిపి ఓడితే.. రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు. ఇది టిడిపి గెలుపు నా కోసమో.. పార్టీ నేతల కోసమో కాదు. రాష్ట్రాభివృద్ధి కోసంమని ఆయన వివరించారు. రాష్ట్రం కోసం నాప్రాణమైనా ఇస్తానని.. వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు.
Your article helped me a lot, is there any more related content? Thanks!