ఇద్ద‌రు తెలుగు క‌వుల‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఇద్ద‌రు తెలుగు క‌వుల‌ను ‘కేంద్ర సాహిత్య పుర‌స్కారాలు’ వ‌రించాయి. వారాల ఆనంద్ రాసిన ‘ఆకుప‌చ్చ క‌విత‌లు’ పుస్త‌కానికి, మ‌ధురాంత‌కం న‌రేంద్ర రాసిన ‘మ‌నో ధ‌ర్మప‌రాగం’ న‌వ‌ల‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డులు ల‌భించాయి. ద్విభాషా క‌వి అయిన ఆనంద్.. ప‌ద్మ‌భూష‌ణ్ గుల్జార్ భావ‌క‌వి గ్రీన్‌ పోయెమ్స్‌ని ‘ఆకుప‌చ్చ క‌విత‌లు’ పేరుతో తెలుగులోకి అనువ‌దించారు. ఇందులో ఉన్న 58 క‌విత‌లు ప్ర‌కృతికి సంబంధిచిన‌వి. ఈ క‌విత‌లు మాన‌వుడుకి, ప్ర‌కృతికి మ‌ధ్య అనుబంధాన్ని వివ‌రిస్తాయి. ఈ పుర‌స్కారం కింద తామ్ర ఫ‌ల‌కం, రూ. 50వేల న‌గ‌దును అంద‌జేస్తారు.

Leave A Reply

Your email address will not be published.