ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు చిన్నారులుతో బావిలో దూకిన తల్లి
జైనథ్ (CLiC2NEWS): ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా బావిలోకి దూకి తనువు చాలించాలనుకుంది. ఈ ఘటనలో చిన్నారులు ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన సుష్మకు ఆరేళ్ల కిందట గణేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సుష్మకు ఆమె భర్తకు మధ్య గొడవలు జరుగుతుండటంతో పెద్దలు సర్థిచెప్పారు. కొంతకాలం
తర్వాత మళ్లీ భార్యా భర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో ఆమె తన ఇద్దరు పిల్లలుతో సమీప వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు సుష్మను కాపాడగలిగారు కానీ.. చిన్నారులు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
I am regular reader, how are you everybody?This article posted at this website is really fastidious.