ఉక్రెయిన్ దాటిలో 400 మంది రష్యన్ సైనికుల మృతి?
కీవ్ (CLiC2NEWS): గత యేడాదికాలంగా ఉక్రెన్-రష్యామధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా ఆక్రమిత డొనెట్స్క్ ప్రాంతంలోని మకివ్వా నగరంపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి దాడులతో ఒక్కసారిగా విరుచుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ ఘటనలో మరో 300 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.
రష్యా సైనికులు ఆశ్రయం పొందుతున్న ఓ భనంపై ఈ దాడి చేశామని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో రష్యా కు భారీగా ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలిపింది. కాగా రష్యా ఉక్రెయిన్ ప్రకటనను కొట్టిపారేసింది. ఉక్రెయిన్ దాడి. ప్రాణ నష్టం వాస్తవమేనని అయి.. వారు తెలిపిన స్థాయిలో మరణాలు లేవని రష్యా పేర్కొంది.